India Border lo Rangulu Mare Sarassu 😱🌈 | Ladakh
me mani ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- పాంగాంగ్ సరస్సు ▶ 2:38
ప్రపంచంలోనే ఉన్న అతి పెద్ద సాల్ట్ వాటర్ లేక్, పావు వంతు భాగం భారతదేశంలో ఉంది, మిగతా మూడు వంతులు చైనాలో ఉంది. 15,000 అడుగుల ఎత్తులో ఉంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి సగం వరకు నీరంతా ఐస్ గా మారిపోతుంది, దీని మీద నడవొచ్చు, కార్ నడుపుకొని వెళ్లొచ్చు. ఫిబ్రవరి నెలలో ఈ లేక్ మీద మారథాన్ కూడా జరిగింది. సీజన్ బట్టి రంగులు మారిపోతాయి — నీలం, తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు.
- హిమాంక్ కేఫ్ ▶ 6:21
పాంగాంగ్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ కేఫ్ హిమాంక్ ఉంటుంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) వాళ్ళకి సంబంధించిన కేఫ్. 13,862 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇంత చల్లటి క్లైమేట్ లో వేడి వేడి కాఫీ తాగుతుంటే అద్భుతంగా ఉంది. లోపల యంబియన్స్ కూడా చాలా బాగుంది. వాష్ రూమ్స్ కూడా ఎయిర్పోర్ట్స్ లో ఎలా మెయింటైన్ చేస్తారో అంత హైజినిక్ గా ఉన్నాయి.
- చాంగ్లా పాస్ ▶ 11:41
మంచు తుఫాన్ నుంచి తప్పించుకొని మూడు నాలుగు గంటల తర్వాత ఫైనల్ గా చాంగ్లా పాస్ వరకు రీచ్ అయ్యాం. ఇది ప్రపంచంలో ఉన్న ఎత్తైన మోటర్బుల్ రోడ్స్ లో ఒకటి, సుమారుగా సముద్ర మట్టం నుంచి 17,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. చలికాలంలో ఇక్కడ టెంపరేచర్స్ చాలా తక్కువ ఉంటాయి, రోడ్స్ కూడా క్లోజ్ లో ఉంటాయి.
- సియాచిన్ గ్లేసియర్ ▶ 12:22
లదాక్ లో ఇంకో ఇంపార్టెంట్ ప్లేస్ సియాచిన్ గ్లేసియర్. ఇది ఇండియాకి చాలా స్ట్రాటజిక్ అండ్ ఇంపార్టెంట్ ఏరియా. ప్రపంచంలోనే ఉన్న హైయెస్ట్ బాటిల్ ఫీల్డ్ అని కూడా పిలుస్తారు. ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ అక్కడ ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ లో కూడా డ్యూటీ చేస్తారు. టెంపరేచర్స్ కొన్నిసార్లు -40 నుంచి -50° వరకు కూడా చేరుకుంటాయి.
- తిక్సే మానెస్ట్రీ ▶ 13:12
బ్యాక్ టు లే వెళ్లే రూట్ లో మమ్మల్ని ఆగేలా చేసిన ప్లేస్ అదే తిక్సే మానెస్ట్రీ. లదాక్ లో ఉన్న వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మానెస్ట్రీ. టిబ్బెట్ లో ఉన్న ఫేమస్ పోట్ల ప్యాలెస్ లా కనిపించింది, అందుకే దీన్ని చాలా మంది మినీ పోట్ల ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఆల్మోస్ట్ 12 ఫ్లోర్ల ఎత్తు ఉంటుంది. లోపల ఒక హ్యూజ్ బుద్ధ స్టాచూ ఉంటుంది, ఇది లదాక్ లోనే ఉన్న బిగ్గెస్ట్ బుద్ధ స్టాచూస్ లో ఒకటి. పొద్దున్నే ప్రేయర్ టైం లో వెళ్తే డ్రమ్ సౌండ్స్, మంత్రాలు, చుట్టూ ఉన్న వాతావరణం చాలా స్పిరిచువల్ గా ఉంటుంది.